హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు FSSAI లైసెన్స్ మేళా

JN: జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల కోసం ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో FSSAI లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు. వ్యాపారులు కొత్త లైసెన్సులు పొందేందుకు, రెన్యువల్ చేసుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు.