హైదరాబాద్: 28°C
వార్తలు

సీఈసీ రాజీనామా చేసే వరకు నిరసనలు: ఇండీ కూటమి

దేశం మొత్తం తమతో ఉందని ఇండీ కూటమి నేతలు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కడ చూసినా బ్యారికేడ్లు పెట్టారని మండిపడ్డారు. తమ ఆందోళనలను అణిచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసన చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని.. కానీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేయకుండా డీనోటిఫై చేశారని దుయ్యబట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని వెల్లడించారు.