JGL: జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్‌ను కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంగళవారం వినతిపత్రం అందజేశారు. మెట్‌పల్లి మండలం చెల్లకొండపూర్ MPPS పాఠశాలలో కిచెన్ షెడ్, పెద్దాపూర్ లో అంగన్ వాడీ కేంద్రం, కోరుట్ల మండలం సంగెం గ్రామంలో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
తెలంగాణ
కలెక్టర్‌ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే


