హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెరిగిన పత్తి ధర..!

MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. మంగళవారం క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.9,229 ధర పలికింది. సోమవారం నమోదైన రూ.9,111తో పోలిస్తే ధర పెరిగింది. వరుసగా రెండు రోజులుగా సగటు ధర రూ.9,000 దాటడంతో రైతులకు కొంత ఊరట లభిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో సరఫరా తగ్గవచ్చన్న అంచనాలు ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.