హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎం ఇలాకాలో రైతులకు అన్యాయం'

VKB: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు. భూమి ఇవ్వలేదని వెంకటయ్య అనే రైతు పొలానికి విద్యుత్ నిలిపివేసి, భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం, మంత్రులు విహారయాత్రల్లో ఉన్నారని మండిపడ్డారు.