హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఉచిత విద్యుత్ రాయితీపై ఢిల్లీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విద్యుత్ రాయితీ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్య, ప్రభుత్వ ఖజానాపై పడుతున్న విద్యుత్ భారాన్ని నియంత్రించడంతో పాటు పథకంలో పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఆధార్ వివరాలు సమర్పించాలని తెలిపింది.