హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాతకు గండ్ర ప్రత్యేక పూజలు

BHPL: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా BHPL పట్టణంలోని సింగరేణి 5 ఇంక్లైన్ మైన్, రెడ్డి కాలనీ మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవార్లను మంగళవారం మాజీ MLA గండ్ర వెంకట రమణా రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నవితరణలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.