హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్ నీనో ఎఫెక్ట్... తగ్గిన పత్తి పంట దిగుబడి

గద్వాల్ జిల్లాలో ఈ ఏడాది లక్షకు పైగా ఎకరాలలో పత్తి పంటను రైతులు సాగు చేశారు. కానీ ఎల్ నీనో కారణంగా సరైన వర్షాలు కురవకపోవడంతో పత్తి కాయలు, ఆకులు రాలడంతో పంట దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. ఎకరాకు 10-15 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం లోటు వర్షపాతం కారణంగా కేవలం 4-7 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.