ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో వర్షాలు కురవాలని కోరుతూ మహిళలు పోచమ్మ తల్లికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికీ తిరిగి నీళ్లు సేకరించి తలపై బిందెలతో ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు.మహిళలు మాట్లాడుతూ ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకమని, ఇలా చేస్తే వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయని గ్రామస్థులు విశ్వసిస్తున్నామన్నారు.
తెలంగాణ
VIDEO: వర్షాల కోసం పోచమ్మకు జలాభిషేకం


