హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు

BHPL: చెన్నాపూర్ గ్రామంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వంగరి శంకర్, పల్లెబోయిన గణపతి, జూపక శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.