హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం మత్తులో ఆటో బీభత్సం.. కారు ధ్వంసం

MDCL: మద్యం మత్తులో ఆటోను అతివేగంగా నడిపిన డ్రైవర్ కారును ఢీకొట్టి ధ్వంసం చేశాడు. ఆదివారం రిషి స్కూల్ సమీపంలోని SBI బ్యాంకు వద్ద ఈ ఘటన జరిగింది. కారు హెడ్ లైట్, బంపర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. మేడిపల్లి పోలీసులు ఆటోను సీజ్ చేసి డ్రైవర్ ఎస్. రాముతో పాటు యజమాని కె. భీమ్రాజ్‌పై  కేసు నమోదు చేశారు. ఆటోలోని మరో వ్యక్తి కృష్ణపై పెట్టీ కేసు నమోదు చేశారు.