KMR: కామారెడ్డి మండల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఏపీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, తేమశాతం 17 శాతం ఉండేలా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వరి కేంద్రాల్లో రైతులకు తాగునీరు, టార్పాలిన్లు, టెంట్లు, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు.
తెలంగాణ
వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ


