రాజస్థాన్ భౌండా గ్రామంలో దారుణం జరిగింది. అక్రమ మైనింగ్ నేపథ్యంలో గ్రామస్థులు చేసిన దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ మృతి చెందారు. ప్రభుత్వ గడ్డి భూములను ఆక్రమించి, నిబంధనలను తుంగలో తొక్కుతూ తవ్వకాలు జరుపుతున్నారంటూ కొంతకాలంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మూతపడిన స్టోన్ క్రషర్‌ను అత్తర్ ఓపెన్ చేస్తుండగా వివాదం చెలరేగి జరిగిన దాడిలో ఆయన చనిపోయారు.
వార్తలు
గ్రామస్థుల దాడిలో మాజీ ఎమ్మెల్యే మృతి


