హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలపై వైస్ ఛైర్మన్ ఆరా

VKB: వికారాబాద్ 10వ వార్డు పరిధిలోని అనంతగిరిపల్లి బంజగూడెంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పర్యటనలో కురువ శీను, శేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.