హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోనాలలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

ADB: సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు బోథ్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు గుడాల అనీష్ మంగళవారం తెలిపారు. పేద, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏర్పాటుకు సహకరించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.