హైదరాబాద్: 28°C
వార్తలు

స్పీకర్ నిర్ణయాన్ని సమర్థించిన మద్రాస్ హైకోర్టు

ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తూ తమిళనాడు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. రాజీనామాల ఆమోదం రాజ్యాంగబద్ధమేనని, దీనిపై విచారణ అవసరం లేదని సీజే సుశ్రుత్ అరవింద్, జస్టిస్ అరుల్ మురుగన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అన్నాడీఎంకే విప్ కృష్ణమూర్తి వేసిన పిటిషన్లపై కోర్టు ఈ తీర్పునిచ్చింది.