హైదరాబాద్: 28°C
వార్తలు

రికార్డు స్థాయిలో పత్తి ధర.. క్వింటా ఎంతంటే?

TG: రాష్ట్రంలో పత్తి రికార్డు స్థాయిలో ధర పలికింది. భద్రాద్రి కొత్తగూడెం(D) జూలూరుపాడు మార్కెట్ యార్డులో నిన్న జరిగిన జెండాపాటలో క్వింటా రూ.10,600 పలికింది. రాష్ట్రంలో ఇదే అత్యధిక రేటు అని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. కరీంనగర్(D) జమ్మికుంట మార్కెట్‌లో రూ.9,090, వరంగల్ మార్కెట్‌లో రూ.9,060 పలికింది. కాగా ప్రభుత్వం ఈ ఏడాది మద్దతు ధరను రూ.8,667గా నిర్ణయించింది.