హైదరాబాద్: 28°C
వార్తలు

సరిహద్దులో భారీ ఆయుధాలు స్వాధీనం

సరిహద్దు వెంబడి భారీ ఆయుధాలు, RDX అక్రమ రవాణా కుట్రను BSF, ANTF సంయుక్తంగా భగ్నం చేశాయి. రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్ జిల్లా సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్ ద్వారా జారవిడిచిన 3 ప్యాకెట్లలో భారీ పేలుడు పదార్థాలు, 2 పిస్టళ్లు, 650 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను తరలిస్తున్న పంజాబ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.. సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు.