హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు

భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం అత్యంత బలంగా విస్తరిస్తోందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు. గత వారమే ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య కీలకమైన ఫోన్ సంభాషణ జరిగిందని వెల్లడించారు. ఈ ఇద్దరు అగ్రనేతల చర్చల అనంతరం ఇరుదేశాల వ్యూహాత్మక బంధంలో సరికొత్త పరిణామాలు రాబోతున్నాయన్నారు. రానున్న రోజుల్లో ఏం జరగనుందో వేచి చూడాలని పేర్కొన్నారు.