జ్ఞానం, సంపద, అధికారం ఎవరి దగ్గర ఉన్నా.. వాటిని ఎలా ఉపయోగిస్తున్నారనేది చాలా కీలకమని ప్రధాని మోదీ అన్నారు. అధికారానికి ఉన్న నిజమైన విలువ దాని లక్ష్యం, ఉద్దేశంలోనే ఉంటుందని తెలిపారు. నేటి కాలంలో ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. వేలాది ఏళ్ల భారతీయ సంప్రదాయం మనకు ఇదే నేర్పిందని, దీన్ని తమ ప్రభుత్వ పాలన, పని సంస్కృతిలో అన్వయించి చూపామని మోదీ స్పష్టం చేశారు.
వార్తలు
‘అధికారం వెనుక ఉన్న ఉద్దేశమే గొప్పది’


