ప్రపంచ ఆర్థిక సవాళ్ల నడుమ ఢిల్లీలో జరుగుతున్న 'బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్'లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి ఏటా ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులను ఈ వేదిక ఏకం చేస్తుందని అన్నారు. తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును భారత్‌లో నిర్వహించడంపై బ్లూమ్‌బెర్గ్ బృందానికి అభినందనలు తెలిపారు. సదస్సు కోసం సరైన సమయంలో, సరైన ప్రదేశాన్నే ఎంచుకున్నారని మోదీ ప్రశంసించారు.
వార్తలు
‘సరైన సమయంలో సరైన వేదిక ఎంచుకున్నారు’


