హైదరాబాద్: 28°C
వార్తలు

జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతల అరెస్ట్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలపై నిషేధం విధించిన మరుసటి రోజే ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా వాలంటీర్లతో కలిసి ఆకస్మిక ఆందోళన చేపట్టారు. పోలీసు బారికేడ్లు, ఇనుప గేట్లు దూకి లోపలికెళ్లి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిరసనలను ఎవరూ ఆపలేరంటూ సీజేపీ ఫౌండర్ అభిజీత్ దిప్కే వీడియో షేర్ చేశారు.