హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల తనిఖీలో.. 4,000 లీటర్ల బెల్లం ఊట

MHBD: కేసముద్రం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరుకొండపల్లి గ్రామం మేగ్యా తండాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 4,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 50 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. 50 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతి కిరణ్ గ్రామస్థులతో మాట్లాడారు.