హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ ఏడాది రామ్‌లీలాలో 3 రోజులే ఖాళీ

జంతర్ మంతర్ వద్ద నిరసనలపై నిషేధం విధించడంతో ప్రత్యామ్నాయంగా సూచించిన రామ్‌లీలా మైదానంలో ఆందోళనలకు భారీ ఖర్చు తప్పడం లేదు. ఇక్కడ ఒక్కరోజు బుకింగ్‌కు రూ.1.21L వరకు ఖర్చు అవుతుండగా, ఢిల్లీ పోలీసుల NOC తప్పనిసరి చేశారు. పైగా ఈ ఏడాది DEC 29, 30, 31 తేదీల్లో మాత్రమే ఖాళీలు ఉండగా మిగతా రోజులు బుక్ అయ్యాయి. మరోవైపు ఉచిత నిరసన ప్రాంతంలో కేవలం 150 మందికే అనుమతి ఇస్తున్నారు.