ATP: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మంగళవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
కనకదుర్గమ్మ అమ్మవారి సేవలో ఎమ్మెల్యే


