హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మూలో ఉగ్రవాదుల చొరబాటు భగ్నం

జమ్మూకశ్మీర్ సరిహద్దులో భారీ ఉగ్ర చొరబాటు యత్నం భగ్నమైంది. పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్ సమీపంలో భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులు ఐఈడీ పేలుడులో హతమయ్యారు. ఈ ఘటనలో నలుగురు ముష్కరులు మృతి చెందారు. మృతుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఫైజాన్‌తో పాటు వకాస్, ఇష్తియాక్, ఆసిమ్ ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.