హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీటీ రోడ్డు అధ్వానం.. మరమ్మతులు చేపట్టాలి'

NLG: చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామం నుంచి మునుగోడు మండలం ఇప్పర్తి మీదుగా వెళ్లే బీటీ రోడ్డు అధ్వానంగా మారింది. ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్డుపై బీటీ తొలగి కంకర తేలడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చికిలంమెట్ల అశోక్ సోమవారం ప్రకటనలో కోరారు.