ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఈరోజు తేనీటి విందు కార్యక్రమం జరగనుంది. ఇండి కూటమి నేతలు, పౌరసమాజం ప్రతినిధులు, విద్యార్థి సంఘాలకు రాహుల్ ఈ విందు ఇవ్వనున్నారు. ఓటు చోరీ ఆరోపణలపై ఉమ్మడి నిరసన కార్యాచరణ ఖరారు, జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు ఒత్తిడి పెంచడంపై ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. విందు అనంతరం ప్రతిపక్ష నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
వార్తలు
రాహుల్ నివాసంలో నేడు తేనీటి విందు


