AP: రాష్ట్రానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. వర్ష సూచన నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు, ముంపు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్తలు
నాలుగు రోజులపాటు భారీ వర్షాలు


