హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో నేడు జగన్ భేటీ

AP: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ తమ కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో మాజీ సీఎం జగన్ ఈరోజు సమావేశం కానున్నారు. ఈ భేటీలో స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించడంతో పాటు, గెలుపు గుర్రాలైన అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించి నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.