హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మైనింగ్ పనులు నిలిపివేయాలని స్థానికుల ధర్నా

NLG: దేవరకొండ మండలం కాచారం గ్రామ సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ పనులను నిలిపివేయాలని గ్రామస్తులు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ మైనింగ్ వల్ల దుమ్ము, ధూళి, బ్లాస్టింగ్ శబ్దాలతో అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టల ప్రాంతంలో మైనింగ్ జరుగుతుండడంతో మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. పనులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.