హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినో డేంజర్‌ బెల్స్‌.. 1972 నాటి విలయం!

దేశంలో ఎల్‌నినో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రస్తుత కరువు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని 265 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు సమాచారం. సుదీర్ఘ విరామాలతో కురిసిన వర్షాలు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ఏడాది కరువు 1972లో వచ్చిన మహా కరువు కంటే దారుణంగా మారవచ్చని మహారాష్ట్ర సీఎం సైతం ఆందోళన వ్యక్తం చేశారు.