హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యువకుడి మృతి.. న్యాయం కోసం ధర్నా

BHPL: కాటారం మండలం చిదనపల్లిలో దసరా పండుగకు బల్బులు ఏర్పాటు చేస్తుండగా ఆదివారం కరుణాకర్ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. సర్పంచ్ జగదీశ్వర్ ఫోన్ చేసి తన కుమారుడిని తీసుకెళ్లారని, ఆయన కారణంగానే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. న్యాయం చేయాలని సోమవారం మహదేవపూర్ కూడలిలో ధర్నా చేపట్టారు. పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.