హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామంలో నక్క హల్‌చల్‌

KMR: జుక్కల్‌ (M) చిన్న ఏడ్దిలో గ్రామంలో నక్క హల్‌చల్‌ చేసింది. కనిపించిన వారిపై దాడికి ప్రయత్నించడంతో గ్రామస్తులు బీట్‌ ఆఫీసర్‌ రాములుకు సమాచారం ఇచ్చారు. ఆయన నక్కను పట్టుకుని వెటర్నరీ ఆసుపత్రికి తరలించగా, డాక్టర్‌ పండరినాథ్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నక్కను జుక్కల్‌ అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు బీట్‌ ఆఫీసర్‌ తెలిపారు.