హైదరాబాద్: 28°C
తెలంగాణ

B.R నాయుడుకి BJP నేతల కృతజ్ఞతలు

ఖమ్మంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపడుతున్నందుకు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడుకు బీజేపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శిథిలావస్థకు చేరిన స్థానిక టీటీడీ కల్యాణ మండపాన్ని ఆధునీకరించాలని, ఆ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఛైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.