హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటలు ఎక్కడ ఎండిపోలేదు: ఎస్ఈ

KNR: వ్యవసాయానికి నిరంతర విద్యుత్ కోసం చర్యలు ముమ్మరం చేశామని కరీంనగర్ ఎస్ఈ విజయేందర్ రెడ్డి అన్నారు. సోమవారం గంగాధర మండలంలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులకు రోజుకు 12 గంటలకు పైగా త్రీఫేజ్ విద్యుత్ ఇస్తున్నామని, పంటలు ఎక్కడా ఎండిపోలేదన్నారు. సబ్ స్టేషన్లలో ఏఈలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోడ్ సమస్య ఉంటే అదనపు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు.