హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత మగ్గం వర్క్ శిక్షణ

NGKL: జిల్లా కేంద్రంలో యూనియన్ RSETIలో గ్రామీణ నిరుద్యోగ యువతకు 30 రోజుల ఉచిత మగ్గం వర్క్ శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ షేక్ జావేద్ అహ్మద్ తెలిపారు. 18–45 ఏళ్ల వారు అర్హులు. ఉచిత భోజనం, సర్టిఫికెట్‌ తో పాటు అర్హత మేరకు బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఆసక్తిగల వారు అవసరమైన పత్రాలతో అక్టోబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.