MHBD: గార్ల మండలం మర్రిగూడెం పంచాయతీ పరిధిలోని రైతులు విద్యుత్ సమస్యలపై గార్ల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పంటలకు సరిపడా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని, లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి మోటార్లు కాలిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీపీలు ఓవర్‌లోడ్‌తో కాలిపోకుండా చూడాలని కోరుతూ విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ సమస్య.. రైతుల ఆందోళన


