NGKL: తీన్మార్ మల్లన్న చేపడుతున్న బీసీ రాజ్యాధికార పాదయాత్రను విజయవంతం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి బీసీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ నెల 15న బిజినేపల్లి నుంచి నాగర్‌కర్నూల్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. బీసీల హక్కులు, ఐక్యతను చాటిచెప్పేందుకు నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
బీసీ పాదయాత్ర విజయవంతం చేయాలి


