హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెలిమినేడులో రైతులకు అవగాహన సదస్సు

NLG: చిట్యాల మండలం వెలిమినేడులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో సోమవారం రైతులకు FPO సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి మాట్లాడుతూ.. రైతులందరూ FPOలో సభ్యత్వం తీసుకొని, సంఘం ద్వారా అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం FPO ఎలా పనిచేస్తుందనే అంశంపై రైతులకు అవగాహన కల్పించారు.