హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన ఎమ్మెల్యే

GWDL: మల్డకల్ మండలం దాసరిపల్లి, ఉలిగేపల్లి గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గృహప్రవేశాలు నిర్వహించిన లబ్ధిదారులకు కానుకలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లతో పేద ప్రజల సొంతింటి కల నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.