GWDL: అయిజలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారు కాళికాదేవి గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు అభిషేకం, అర్చన, హోమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు అర్చకుడు సర్వేశ్వర చారి తెలిపారు.
తెలంగాణ
గాయత్రీ దేవిగా కాళికాదేవి దర్శనం


