హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు ప్రారంభం

WMP: రేవల్లిలో వనపర్తి చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు సోమవారం ప్రారంభమయ్యాయి. కబడ్డీ, క్రికెట్, చదరంగం, ఫుట్‌బాల్, వాలీబాల్, త్రోబాల్ విభాగాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ప్రతిభావంతులను ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కీర్తన, ఎంఆర్డీవో సరస్వతి, ఎంఈవో వరప్రసాద్ రావు ఉన్నారు.