హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూకాలమ్మ అమ్మవారిని దర్శించిన ఎమ్మెల్యే వరుపుల

కాకినాడ: శంఖవరం మండలం కత్తిపూడిలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.