హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి చెందిన 200 మంది ప్రభుత్వ అధికారులు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. ఈడీ, సీబీఐ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారని బాంబు పేల్చారు. కేంద్రంపై తమ పోరాటం ఒక్కరోజుతో ఆగేది కాదని రాహుల్ స్పష్టం చేశారు.