హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

సత్యసాయి: పుట్టపర్తి పట్టణ సమగ్ర అభివృద్ధికి మున్సిపల్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు. జానకిరామయ్య కళ్యాణ మండపంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి 'స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు' సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించారు.