కృష్ణా: గుడివాడ 20వ వార్డులోని బ్యాంక్ కాలనీలో రూ.60 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఆర్టీసీ కాలనీలో రూ.70 లక్షలతో పార్కు అభివృద్ధి పనులకు, సత్యనారాయణపురంలో రూ.45 లక్షలతో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రాము సోమవారం శంకుస్థాపన చేశారు. గుడివాడ అభివృద్ధి ఒక రోజుతోనో, ఒక కార్యక్రమంతోనో పూర్తయ్యేది కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


