హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేకుల షెడ్డుకు రూ.47 వేల విద్యుత్ బిల్లు!

కోనసీమ: పల్లంకుర్రు గ్రామానికి చెందిన పేద మహిళ రేకుల షెడ్డుకు రూ.47,063 విద్యుత్ బిల్లు రావడంతో గత 10 నెలలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పీజీఆర్‌ఎస్‌లో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. విద్యుత్ సమస్యతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.