హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు వార్డు అడ్మిన్ల సస్పెన్షన్

గుంటూరులో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డు అడ్మిన్ కార్యదర్శులను అధికారులు సస్పెండ్ చేశారు. ఆస్తిపన్ను సేవలను పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉంచడంతో చర్యలు తీసుకున్నారు. ఆటోనగర్-02 వార్డు అడ్మిన్ పద్మావతి, కొండవారివీధి-03 అడ్మిన్ సుందర్ సింగ్‌లపై వేటు వేశారు. షోకాజ్ నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోవడంతో కమిషనర్ మయూర్ అశోక్ వారిని సస్పెండ్ చేశారు