హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీ ఆటోలు ప్రారంభించిన MLA

తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఎలక్ట్రిక్ ఆటోలను స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు.పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించి కాలుష్య నివారణకు ఈవీ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు. డ్రైవర్లకు ఆర్థిక ప్రయోజనంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.